టిడిఎఫ్ కెనడా ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం!

తెలంగాణ జాతిపిత, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 81వ జన్మదిన వేడుకలు దేశీయంగానే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా అత్యంత వైభగంవా జరుపుకున్నారు. అందులో భాగంగా… తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, కెనడా (TDF, Canada) ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది.

కెనడాలోని ఒంటారియో రాష్ట్రం మిస్సుస్సుగా నగరంలో ఆచార్య జయశంకర్ 81వ జయంతి సందర్భంగా రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తెలంగాణ ప్రవాస భారతీయులు పాల్గొన్నారు! ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడంలో సహకరించినవారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు!

 


Telangana Development Forum - Canada. © Copyright 2014 Hosting by Setup More